top of page

కాపురాలకు పిండం పెట్టుకున్న భర్తలు - MIC TV


చనిపోయిన వారికి పిండప్రదానం చేసే కాశీలోని మణికర్ణికా ఘట్టం భార్యాబాధితుల కన్నీళ్లతో చెమర్చిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 300 మందికిపైగా భర్తలు.. తమ కాపురాలకు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. సోమవారం ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ సంస్థ ఆధ్వర్యంలో ఈ తతంగం జరిగింది.

బాధితులంతా ఫెమినిజంపై ఆడిపోసుకున్నారు. స్త్రీవాదం, హక్కులు, సమానత్వం అంటూ భార్యలు తమ కాపురాల్లో అగ్గిపెట్టారని, అందుకే తాము పిండం పెడుతున్నామని చెప్పొకొచ్చారు. తమ కాపురాలు చనిపోయాయని, అందుకు గుర్తుగా ఈ తతంగం నిర్వహించామన్నారు.

కాపురాలకు పిండం పెట్టుకున్న భర్తలు - MIC TV

‘వీళ్లంతా అమయకపు భర్తలు.. వీళ్లపై భార్యలు తప్పులు కేసులు పెట్టారు. స్త్రీవాదం పేరుతో నానా యాగీ చేశారు… అందుకే వీరు తమ దాంపత్య జీవితాలకు పిండం పెట్టుకున్నారు..’ అని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ప్రతినిధి అనుమప్ దూబే చెప్పారు. భర్తలు ఒక్కొక్కరు తమ గోడు వెళ్లబోసుకుంటుంటే విలేకర్లు అయ్యో పాపం అంటూ బోలెడు సానుభూతి కురిపించేశారు.

‘నేను పుణేలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. నాలుగేళ్లుగా భార్య చేతుల్లో నరకం అనుభవిస్తున్నాను. ఆమె నా జీతమంతా కాజేసి నానా చెత్తా కొంటోంది. వద్దని వారిస్తే.. వరకట్నం కేసు పెడతానని బెదిరిస్తోంది. పోనీ విడాకులు ఇవ్వవే అంటే అందుకూ ఒప్పుకోవడం లేదు..నేను కీలుబొమ్మలా ఉండాలని అంటోంది..’ అని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు

Source, here.

0 comments
bottom of page